YS Jagan - Polavaram Projectచంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన పోలవరం ప్రభుత్వం మారకా నత్తనడకన నడుస్తుంది. బాగా పని చేస్తున్న కాంట్రాక్టర్ ను మార్చి తంటా తీసుకొచ్చింది కొత్త ప్రభుత్వం. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి పోలవరం పట్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రభుత్వం అసమర్థత, అవినీతి వల్ల వర ప్రసాదిని లాంటి పోలవరం శాపం కాబోతోందని ఆయన విమర్శించారు. రివర్స్ టెండరింగ్ అనేది పెద్ద బోగస్ అని ఆయన చెప్పుకొచ్చారు. “రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరంలో ఆదా చేసింది రూ.222.44 కోట్లు.. అదనపు వ్యయం పేరుతో ఖాజానాపై మోపిన అదనపు భారం రూ.3,222 కోట్లు…ఈ చర్యను ఏమనాలి?,” అని ఆయన ప్రశ్నించారు.

“గ్రావిటీ ప్రాజెక్ట్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాబోతుంది. ఎవరి కోసం ఈ మార్పు తెస్తున్నారు? బహుళార్థ సాధక ప్రాజెక్ట్ చిన్న రిజర్వాయర్ కాబోతుంది,” అంటూ ఆయన జగన్ ప్రభుత్వం తీరుని ఎండగట్టారు. మరోవైపు.. పోలవరం లో ఈ కీలక మార్పులు చేస్తుండగా… అప్పటి నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమని ఏదో పెట్టీ కేసులో అరెస్టు చెయ్యడానికి ప్రభుత్వం.

“మంత్రి దేవినేని ఉమ చంద్రబాబు హయాంలో నీటిపారుదల శాఖా మంత్రి. ఆయనకు పోలవరం గురించి అంతా తెలుసు. ఆయన ఈ టైం లో మీడియా ముందుకు వస్తే ఇబ్బంది కాబట్టి. ఏదో వీడియో మార్ఫింగ్ అంటూ సీఐడీ ని ఆయన మీదకు ఉసిగొలిపారు. పోలవరం ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు,” అని టీడీపీ ఆరోపిస్తుంది.