ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సహచర ఎమ్మెల్యేల పై డేగ కన్ను వేసినట్టుగా కనిపిస్తుంది. తాజాగా కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ముఖ్య సలహాదారు అజేయ కల్లం లేఖ రాశారు. మంత్రుల పేషిలలో సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవాలని ఆ లేఖలో సూచించారు. అలాగే.. గత ప్రభుత్వంలో మంత్రుల పేషీల్లో పని చేసిన పర్సనల్ సెక్రటరీలు, అడిషనల్ పర్సనల్ సెక్రటరీలు, ఓఎస్‌డీలను కొత్త మంత్రులు నియమించుకోవదని సూచించారు.
అయితే అవినీతి రహిత పాలన అందించడానికి మంత్రుల పేషీల్లో పని చేసే వారిలో సరైన వారు ఉండటం ఎంతో అవసరమని మంత్రులలో ఎంతో మంది కొత్త వారు ఉన్నారని వారికి ముఖ్యమంత్రి సూచనలు సలహాలు ఉపయోగపడతాయని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అవినీతిని రహిత పాలనకు జగన్ కట్టుబడి ఉన్నారని, అందులో భాగంగానే ఈ చర్య అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఇది మితిమీరిన జోక్యం అంటున్నారు.
సామజిక సమీకరణాలు, యువతరం, సుదీర్ఘంగా విశ్వాసపాత్రత ఇటువంటి అన్ని కొలమానాలు డమ్మి మంత్రులను చేసి ముఖ్యమంత్రి కనుసైగలతో పని చేయించుకోవడానికి, తాజా నిర్ణయంతో ఇది మరొక్కసారి బయట పడింది. కనీసం మంత్రుల పేషిలలో సిబ్బంది నియామకానికి కూడా ముఖ్యమంత్రి ఆమోదం తప్పనిసరి అంటే రేపు ఇక విధానపరమైన నిర్ణయాలలో మంత్రులకు స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది అని వారు ఆక్షేపిస్తున్నారు.