Chandrababu - Naidu -TDP-YS Jagan -YSRCPచివరి నిముషం వరకు ట్రై చేసి తెలుగుదేశం ఒప్పుకోకపోవడంతో తాను గతంలో తిట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పంచనే చేరిన దాడి వీరభద్రరావు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే చంద్రబాబు కేంద్ర మంత్రి అవుతారని అందుకే ఆయన కాంగ్రెస్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒకవేళ దాడి అన్నది జరగాలంటే ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలి.

ఇక్కడ టీడీపీ ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో లోకేష్ ను గనుక సునాయాశంగా ముఖ్యమంత్రిని చెయ్యగలిగితే అప్పుడే చంద్రబాబు అటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే అప్పుడు పార్టీని, లోకేష్ ని వదిలేసి ఆయన కేంద్రానికి వెళ్లే అవకాశం ఏమి లేదు. మరి దాడికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనే సమాచారం ఏదైనా ఉందా? ఒకవేళ అదే జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ కు గడ్డు కాలమే కదా?

మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ ఈరోజు జరుగుతుంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగుతుంది. అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని 96 లోక్‌సభ స్థానాల్లో జరుగుతుంది. ఈ దశ తరువాత మరో ఐదు దశలలో పోలింగ్ జరగబోతుంది. మే 23న ఫలితాలు విడుదల అవుతాయి.