YS- Jagan - Disha Appమహిళల మీద అత్యాచారాలు, గృహహింస మన సమాజంలో సర్వసాధారణం అన్నట్టు. తారలు మారినా, నాగరికత, అక్షరాస్యత పెరిగినా అందులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇందులో చాలా వరకు పోలీస్ స్టేషన్ వరకు రావు. పరువు పేరిట.. ఇంకో పేరిట మహిళలు మౌనంగానే వీటిని భరిస్తారు.

తమకు అన్యాయం జరిగినప్పుడు పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా న్యాయం జరుగుతుంది అన్నప్పుడు… మహిళలు వీటి పై ధైర్యంగా ముందుకు వచ్చి ఎదురుకుంటారు. ఇందులో బాగా చాలా రాష్ట్రాలలో పోలీసులు వాట్సాప్ లో… ఫోన్లలో మహిళల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

ఫిర్యాదు చూశాకా వారే అవసరమైతే బాధితుల ఇళ్లకు వెళ్లి… మరిన్ని వివరాలు సేకరిస్తారు. దీనివల్ల బాధిత మహిళలు ధైర్యంగా తమ మీద జరిగే అకృత్యాలపై కంప్లయింట్లు ఇచ్చే సాహసం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బాధిత మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్లకు గ్రామ సచివాలయం లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూ కొత్త పద్దతి తీసుకొచ్చింది.

తాము తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఈ ఆలోచన చేసినట్టుగా ఉంది. అయితే దీనివల్ల ఏ మేరకు ఉపయోగమంటే అనుమానమే. ఇప్పటిదాకా పోలీసు స్టేషన్లకు వెళ్ళడానికి జంకిన మహిళలు సచివాలయలకు వెళ్ళడానికి కూడా జంకుతారు.

దానితో ఈ కొత్త పద్దతి వల్ల ఉపయోగం ఏమిటి అనేది అనుమానమే. ఇలా సొంత వ్యవస్థల బలోపేతం పై కాకుండా టెక్నాలజీని వాడుకుని ఇంటి నుండే ఇటువంటి ఫిర్యాదులు తీసుకుంటే నిజంగా బాధిత మహిళలకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి.