YS Jagan discussion on drought in andhra pradeshఆంధ్రప్రదేశ్ లోని కరువు పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు చర్చ జరిగింది. ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రకటన చేశారు. సాధారణంగా జూన్ లో 130 మిల్లీ మీటర్ల మేర వర్షం నమోదు అవుతుంటుందని, కాని ఈసారి డెబ్బై మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసిందని ఆయన చెప్పారు. పంటల విస్తీర్ణం కూడా బాగా తగ్గిపోయిందని,కేవలం 3.8 లక్షల హెక్టార్ల మేర మాత్రమే విత్తనాలు వేశారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

ఈ పరిస్థితిని ఎదుర్కునడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వచ్చి నలభై రోజులే అయిందని, అయినా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని జగన్ హామీ ఇచ్చారు. 2013 లో కరవు, తుపానులు వచ్చాయని, అప్పటి ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెప్పినా , ఆ పని చేయలేదని ఆరోపించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.

ఈ ఖరీప్ కు అవసరమైన విత్తనాల సేకరణను కూడా గత ప్రభుత్వం విస్మరించిందని అందుకే విత్తనాల కొరత అని జగన్ చెప్పుకొచ్చారు.
అయితే కరువుపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. అప్పట్లో చంద్రబాబు వస్తే కరువు వస్తుందని…. వరుణుడు మా పార్టీ కావడంతో కరువు అనేది మేము అధికారంలో ఉంటే రాదు అని అప్పటి రాజశేఖరరెడ్డి నుండి ఇప్పటి మీరు కూడా బాకా ఊదారుకదా…. ఇప్పుడు ఇదేంటి అని వారు ఆక్షేపిస్తున్నారు. తమ వైఫల్యాలను గత ప్రభుత్వంపై గెంటేయడం మీ నుండి ఆశించిందే అంటున్నారు.