YS Jagan damage control over temple controversyదేవాలయాల మీద దాడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా టీడీపీ చేస్తున్న ముపేట దాడితో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దీనితో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఉన్న ఫలంగా ప్రభుత్వం కొత్త గుడుల నిర్మాణం అంటూ కొత్త పల్లవి అందుకుంది.

గత ప్రభుత్వంలో పుష్కరాల సమయంలో విజయవాడలో కూల్చివేసిన దేవాలయాలను పునర్నిర్మాణం చేయబోతున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. దక్షిణముఖ ఆంజయనేయ స్వామి సీతమ్మ వారి పాదాలు, రాహు కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడు గుడిని నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు.

పైగా ఈ గుళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారట. నిజంగా దేవాలయాల పట్ల నిబద్దత ఉంటే ఇప్పుడు దాడులు జరిగిన గుళ్ల విషయంలో ఏదో ఒకటి చేసే వారు… అయితే ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పుష్కరాల సమయంలో విజయవాడలో తొలగించిన గుళ్ళ పునర్నిర్మాణం అంటూ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చెయ్యడం కేవలం రాజకీయ లబ్ది కోసమే అని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.

మరోవైపు… రామతీర్థం ఘటనలో సీఐడీ నిజాలను వెలుగులోకి తీసుకువస్తుందని వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో అంతర్వేదిలో రథం తగులబడిన కేసు సిబిఐకి అప్పగిస్తున్నామని ఇలానే హడావిడి చేశారు. ఆ తరువాత ఆ కేసు అతీగతీ లేదు. ఇక రామతీర్థం కేసులో పురోగతి ఉంటుంది అంటే ఎవరికీ నమ్మకాలు లేవు.