YS Jagan Criticizes on pawankalyan personal lifeఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పర్సనల్ గా విమర్శలు చేశారు. జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌‌లో అబుల్‌ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు

అనంతరం మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో తెస్తున్న ఇంగ్లీష్ మీడియంపై విమర్శిస్తున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. “పేదలు కూడా రాణించాలంటే.. ఇంగ్లీషు మీడియం చదువులు ముఖ్యమని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తూ వారం రోజుల క్రితం జీవో ఇచ్చాం. చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారి నోళ్లు తెరచుకున్నాయి. మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకు..?,” అని జగన్ ప్రశ్నించారు.

:ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఒకసారి ఆలోచన చేయాలి. మీ కొడుకులు, మనవళ్లు ఏ మీడియంలో‌ చదువుతున్నారు. ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించేవారు.. వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు..?. రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్‌లో చదువుతున్నారో చెప్పాలి..?. యాక్టర్ పవన్ భార్యలకు ఐదుగురు పిల్లలు.. వాళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు.?” అని ఈ సందర్భంగా విమర్శలకు వైఎస్ జగన్ అంటూ విరుచుకుపడ్డారు.

పవన్ కళ్యాణ్ కు భార్యలు ఉన్నారంటూ వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టుగా లేదని పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే రాజ్యాంగేతర పదవిలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై కూడా రాజకీయ విమర్శలు చెయ్యడం తప్పు పడుతున్నారు.