ys jagan cow poojaఏపీలో జరుగుతున్న వరుస దేవాలయాలపై దాడులు చివరికి ముఖ్యమంత్రి మతం అనే దాని దగ్గరే ఆగుతున్నాయి. అధికార పక్షం ఈ దాడులను ప్రోత్సహిస్తుంది అని అనకపోయినా సొంత మతం వారు ఉండటంతో ప్రభుత్వం వారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. దీనితో ముఖ్యమంత్రి జగన్ నష్టనివారణ చర్యలు చేపట్టారు.

ఉన్నఫళంగా ఆలయాలకు శంకుస్థాపనలు… పూజలు… గోపూజలు వంటివి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో ఇస్కాన్ అందించిన 108 గోవులకు టీటీడీ, దేవదాయశాఖ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవ కార్యక్రమం జరిగింది. గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

అయితే దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దిగజారుడు రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, బాబాయి హత్యపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ అని అన్నారు.

ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్‌కు లేదని… అందుకే క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలు దూరం చేశారని మండిపడ్డారు. ఓ వైపు రథాలు తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేయించి మరో వైపు పూజల్లో పాల్గొంటున్నారని, అధికారపార్టీ మతాల మధ్య మంట పెట్టి చలికాచుకునే విధానానికి ఆపాలని హితవు పలికారు.