Supreme court and high court shocks ys jagan governmentకరోనా విపత్తుని ఎదురుకోవడంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా యాక్టీవ్ గా పని చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా వెనుక పడ్డారనే చెప్పాలి.

మీడియా ముందుకు వస్తుంటే ఏదో ఒక తప్పు దొరలి ట్రాలింగ్ కు గురి కావడంతో మీడియా ముందుకు రావడానికే జంకుతున్నారు. ఈ క్రమంలో జగన్ బాగా వెనుకబడిపోయారు అనే ఫీలింగ్ ప్రజలలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లేకపోవడం, పెద్ద కంపెనీలు కూడా లేకపోవడంతో ఇతర దేశాల నుండి వచ్చే వారు తక్కువే. లేకపోతే జగన్ ప్రభుత్వం బాగా విమర్శలపాలు అయ్యేది.

ఈ క్రమంలో పబ్లిసిటీ కోసం గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను గట్టిగా ప్రమోట్ చేసే పనిలో పడింది వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్. వాలంటీర్ల ద్వారా విదేశాల నుండి వచ్చిన వారిని రెగ్యులర్ గా చెక్ చెయ్యడం వల్లే కేసులు తక్కువ అని చెబుతున్నారు. అయితే ఆ వ్యవస్థ లేని రాష్ట్రాలలో కూడా ఆశా వర్కర్లు, ఇతర సిబ్బందితో ఇటువంటి చెక్కింగులు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. కేరళలో, బ్రిటన్ లో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజలను కూడా స్వచ్ఛందంగా ముందుకు రమ్మని అక్కడి ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. వాలంటీర్ గా అంటే స్వచ్ఛందంగా ముందుకు రమ్మని, దానికి జగన్ ప్రభుత్వం నుండి ప్రేరణ పొంది అక్కడ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయని సాక్షి, సోషల్ మీడియా వింగ్ ప్రచారం చెయ్యడం గమనార్హం. వాలంటీర్ల ద్వారా పసలేని జగన్ ప్రభుత్వానికి గాలి గొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వారు విమర్శిస్తున్నారు.