YS Jagan conspiracy on capital Amaravati YS Jagan conspiracy on capital Amaravati గత వారంలో మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిని అమరావతి నుండి తరలించడం దాదాపుగా ఖాయమన్నట్టుగా వ్యాఖ్యానించారు. అది తీవ్ర దుమారం లేపి ప్రతిపక్షాల నుండి విమర్శలు రప్పిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు రాజధాని మార్పుని ఇప్పటికే ఖండించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30,31న రాజధాని గ్రామాలలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై అధ్యాయం చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో అసలు బొత్స ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం వెనుక పెద్ద కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తుంది.

“అమరావతిని మార్చే సత్తా జగన్ కు లేదు. రాజధానిని మారిస్తే కొత్త రాజధాని కట్టే సీన్ లేదు. కేంద్రం కూడా సహకరించే పరిస్థితి లేదు. 2014 ముందు తామే అధికారంలోకి వస్తామని, దొనకొండను రాజధాని చేసుకోవచ్చు అని చాలా భూములు కొన్నారు. ఆ తరువాత వాటి రేట్లు పడిపోయాయి. ఇప్పుడు ఈ పుకార్ల ద్వారా దొనకొండలోని వారి భూముల రేట్లు పెంచుకుని అమ్ముకుంటారు. వాటిని కొన్న అమాయకులు నిండా మునుగుతారు,” అని టీడీపీ నాయకుల విశ్లేషణ.

ఇందులో ఎంత వరకూ నిజమో తెలీదు గానీ… బొత్స ప్రకటన తరువాత దొనకొండ చుట్టుపక్కల ఎక్కడ భూముల్లో చూసినా ప్రస్తుతం పదుల సంఖ్యలో వ్యాపారులు, కొనుగోలుదారులు కన్పిస్తున్నారు. ఇదే సమయంలో దొనకొండకు రెండు కిలోమీటర్ల లోపు ప్రధానరోడ్ల పక్కనే ఉన్న భూముల విలువ అమాంతం పెరిగింది. ఎకరా రూ.60లక్షలకు చేరింది. కొద్దిగా దూరంగా ఉన్న భూములు రూ.20లక్షల నుంచి రూ.30లక్షలు పలుకుతున్నాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరిగింది