YS Jagan declares 1st November as Andhra Pradesh formation dayఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“బయటవారి కత్తిపోట్లు, సొంతవారి వెన్నుపోట్లతో దగా పడ్డాం. కులాల కలుపు మొక్కలు రాష్ట్ర పరువు తీస్తున్నాయి. వ్యవస్థలను వ్యక్తులు మేనేజ్ చేస్తున్న విధానం రాష్ట్రాన్ని దెబ్బతీస్తోంది. ప్రజాబలం, దేవుడి ఆశీస్సులతో ముందుకువెళ్తున్నామని’’ అంటూ సీఎం వైఎస్‌ జగన్ చెప్పుకొచ్చారు. కులాల కలుపు మొక్కలు రాష్ట్ర పరువు తీస్తున్నాయని జగన్ చెప్పిన మాట ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరలేపుతుంది.

“2014 నుండి కులాలని నమ్ముకునే జగన్ రాజకీయం చేశారు. ఒక కులం కోసమే చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తుంది అంటూ లేనిపోనివి ఆపాదించి సమాజంలో చీలిక తెచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తీరు మారింది లేదు. కమ్మ కులం అయిన వారందరినీ వేధిస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల దగ్గర నుండి ఎన్నికల అధికారి వరకు అదే దృష్టిలోనే చూశారు,” అంటూ టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.

“ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పై కులం పేరిట ఆరోపణలు చెయ్యడం ఎక్కడైనా చూశామా? కాబోయే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మీద కూడా అటువంటి దారుణమైన అభియోగమే. కులాల కలుపు మొక్కలు రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆరోపించే ముందు తన మీదకు వస్తదేమో చూడాలి,” వారు అంటున్నారు.