ys jagan Comedy on power usage  in ap assembly అమరావతి కేంద్రంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రకటనలు వీక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. తొలి రోజు మైక్ ల గురించి మాట్లాడి స్పీకర్, సిఎంలతో సహా అందరినీ నవ్వించిన వైసీపీ అధినేత, తాజాగా బుధవారం నాడు విద్యుత్ చార్జీల వినియోగం గురించి మాట్లాడి, వీక్షించే వారిని నవ్వులలో ముంచెత్తాడు.

విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో వ్యాఖ్యానించిన జగన్… 50 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం ఎలా చెప్తుందని, ఒక్క టీవీ ఉన్నా కూడా నెలకు కనీసం 80 యూనిట్లు విద్యుత్ వినియోగం అవుతుందని, అలాగే ఒక్క సెల్ కు చార్జింగ్ పెట్టుకునే పాయింట్ ఉన్నా గానీ నెలకు 40 యూనిట్ల ఖర్చవుతోందని, దీంతో 50 యూనిట్లు ప్రజలకు ఏ మూలకు వస్తాయని ప్రశ్నించారు.

జగన్ చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఎలా ఉన్నా… ఒక్క మొబైల్ చార్జర్ కు ఏకంగా 40 యూనిట్ల వినియోగం అవుతుందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే అసెంబ్లీ మొత్తం నవ్వగా, ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో వైరల్ గా మారింది. జలీల్ ఖాన్ బికాంలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందని ఎలా ఫేమస్ అయ్యారో… జగన్ కూడా అదే బాటలో ‘1 మొబైల్ చార్జర్ కు 40 పవర్ యూనిట్స్’ అంటూ పాపులర్ అవుతున్నారు.