YS Jagan Clarity on Amaravatiసహజంగా మీడియాకు దూరంగా ఉండే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఒక జాతీయ న్యూస్ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా కూడా తీసెయ్యమని తాను ముఖ్యమంత్రికి చెప్పా అని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించి అంతా చర్చి ఒక నిర్ణయం తీసుకుందాం అన్నారని మంత్రి కొడాలి నాని ఒక ప్రకటన చేశారు.

అది రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నష్టనివారణ గానే ఇంటర్వ్యూ ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయి. జగన్ మరోసారి తాము అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబడి ఉన్నాం అని, మూడు రాజధానుల పై అందుకే అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనితో కొడాలి నాని తెరమీదకు తెచ్చిన వాదనను పక్కన పెట్టినట్టు అయ్యింది.

ఈ విషయంపై మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. ఇది కేవలం నాని అభిప్రాయం మాత్రమే అన్నారు. శాసన రాజధానిని అమరావతి నుంచి తప్పిస్తామని ప్రభుత్వం చెప్పలేదని బొత్స స్పష్టం చేశారు. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలివ్వొద్దనడం సబబు కాదని, కొంత మందే రాజధానిలో ఉండాలనుకోవడం కరెక్ట్ కాదనేది నాని అభిప్రాయం అని బొత్స వివరణ ఇచ్చారు.

అమరావతిని రాజధానిగా తప్పించే ప్రయత్నం చేస్తే రైతులకు లీగల్ అది హెల్ప్ అవుతుంది. ఆ కారణంగానే నామమాత్రంగా మూడు రాజధానులు అనే వాదన తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు అమరావతిలో శాసన రాజధాని కూడా లేదు అంటే కోర్టుల ప్రభుత్వానికి ఇబ్బందే.