Will-YS-Jagan-Forget-Chandrababu-Naidu-Even-in-His-Sleepకాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఆగస్టు 5న గుంటూరులో ‘మిలీనియం మార్చ్‌’ నిర్వహించనున్నట్లు తెలిపారు. లక్షలాది మంది దళితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నామన్నారు. అయితే ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకరంగా ఉన్న రాజమహేంద్రవరం వంతెనపై జగన్‌ పాదయాత్ర చేస్తే అనుమతి ఇచ్చారని, జనసేన అధినేత పవన్‌ కవాతు చేస్తుంటే అనుమతిస్తున్నారన్నారు. ప్రతిపక్షనేత పాదయాత్రకు సహకరిస్తున్న తీరు చూస్తుంటే బాబు, జగన్‌లు కలిసి నాటకాలు ఆడుతున్నారేమోనని అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు.

బహుశా ప్రపంచంలో ఎవరికీ రాని అనుమానం హర్షకుమార్ కు వచ్చి ఉండొచ్చు. బాబు జగన్ కలిసి నాటకాలు ఆడుతున్నారంటే రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతారా? మరోవైపు హర్షకుమార్ కాంగ్రెస్ కు తిరిగి వెళ్లడం దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. ఆయన వస్తే మరోసారి అమలాపురం నుండి ఆయనను ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని ప్రతిపాదన అట.