Pawan Kalyan -YS Jaganఅదేంటి ఒక పక్క జగన్ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుంటే ఆయన జనసేనానితో మాట్లాడించడం ఏంటి అనుకుంటున్నారా? ఆవునేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. మొన్న ఆ మధ్య జనసేన నిజనిర్ధారణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజీనామాలు చేస్తే ఉపయోగం లేదని, రెండు పార్టీలు కలిసి కేంద్రం మీద అవిశ్వాసం పెట్టాలని సూచించారు.

ఉండవల్లి మాట పట్టుకుని పవన్ కళ్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. రెండు పార్టీలను అవిశ్వాసం పెట్టాలని సూచించారు. పవన్ కళ్యాణ్ మాట పట్టుకుని జగన్ వెంటనే చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. అవిశ్వాసం పెట్టాలన్న పవన్ ప్రతిపాదనకు ఒప్పుకుంటున్నా అని, అవిశ్వాసానికి మేం సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ టీడీపీకి జగన్ సవాల్, టీడీపీ అవిశ్వాసం పెడితే మద్దతిస్తాం అని జగన్ ప్రకటించారు.