CBI-Court-Serious-on-CM-YS-Jaganఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు కోర్టులో చుక్కెదురయ్యింది. ఈడీ కేసులో తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని పెట్టుకున్న పిటషన్ ను నాంపల్లిలోని సీబీఐ కోర్టు తిరస్కరించింది.

ఈడీ కేసు విచారణలో భాగంగా సీఎం జగన్ ప్రతి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే సిబిఐ కేసులలో ఆయన పెట్టుకున్న వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలనే పిటీషన్ కోర్టు కొట్టేసింది. తాజాగా పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పిటిషన్ ను తిరస్కరించింది.

తీవ్రమైన ఆర్ధిక నేరాలలో నిందితులు కోర్టుకు హాజరు కావాల్సిందే అని ఈడీ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. కాగా… ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తనపై ఎన్నో బాధ్యతలుంటాయని..అవి వదిలేసి ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం కష్టమని…కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని పిటిషన్ పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉండగా జగన్ ఈరోజు కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు ఆయనకు ఈరోజు పర్మిషన్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుండీ కేవలం ఒక్కే ఒక్క శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు అయ్యారు. అయితే ఇప్పుడు మినహాయింపు రాకపోవడంతో ఆయన ముందు ముందు ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాల్సి ఉంది.