YS jagan CBI Cases Politicsతనపై ఉన్న కేసులన్నింటిని ఒకేసారి విచారించాలని వైసీపీ అధినేత దాఖలు చేసుకున్న పిటిషన్ ను కొట్టివేయనున్నామని హైకోర్ట్ తెలపడంతో, తామే స్వచ్చందంగా ఈ పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లుగా జగన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేసారు. గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ పిటిషన్ విచారణలో తుది తీర్పును కోర్టు తెలియజేయనున్న నేపధ్యంలో… ఈ సంఘటన చోటు చేసుకుంది.

దీంతో వైసీపీ అధినేత జగన్ కు హైకోర్టులో చుక్కెదురైనట్లయ్యింది. అభియోగాల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జగతి పబ్లికేషన్స్ సంస్థ ఈ పిటిషన్ వేయడం సబబు కాదని సీబీఐ గట్టిగా వాదించడంతో జగన్ కు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. తాజా పరిణామాలతో జగన్ కేసుల విచారణ ఇక నుండి రోజు వారీగా జరిగే అవకాశం ఉన్నట్లు మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి.

ఈ ఉదంతంతో సోషల్ మీడియాలో జగన్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. మొన్నటివరకు ‘అన్న వస్తున్నాడు – నవరత్నాలు తెస్తున్నాడు’ అని ప్రచారం చేయమన్న జగన్… ఇక నుండి ‘అన్న వస్తున్నాడు – బోలెడు కేసులు తెస్తున్నాడు’ అంటూ ప్రచారం చేయమని చెప్పాలని, అలాగే వారానికి ఒక్కరోజు కోర్టుకు వెళ్తున్న ప్రస్తుత తరుణంలో… వారానికి ఒక్క రోజు మినహాయింపు వచ్చే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వేస్తున్న సెటైర్లు, కౌంటర్లకు కొదవలేదు.