YS Jagan - andhra pradesh districtsప్రస్తుతం రాజకీయాలలో కులాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కులాల కుంపటి మరింతగా రాజుకుందనే విమర్శలు పొలిటికల్ వర్గాల్లో వినపడుతున్నాయి.

అధికారం చేతిలో ఉంది కదాయని పేరు చివరి ‘రెండు’ అక్షరాల ప్రాతిపదికన అనేక ఉన్నతమైన పదవులను అనర్హులకు కట్టపెట్టారంటూ రఘురామకృష్ణంరాజు లాంటి వారు బహిరంగంగానే వైసీపీ తీరును ఏకరువు పెడుతున్న వైనం తెలిసిందే.

పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న అధికార పక్షం ఈ విమర్శలను పట్టించుకునే స్థాయిలో లేదన్నది వాస్తవం. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ కులాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కోస్తా మరియు కడప కుల రాజకీయాలను పోలుస్తూ ఈ వీడియో రూపొందింది.

కోస్తా బెల్ట్ అయిన కృష్ణా, గుంటూరు జిల్లాలలో కులాలకు ప్రాధాన్యత ఇస్తారనే మాటలను కడపకు చెందిన నేతలు ఎక్కువగా ఆరోపిస్తారని, ముఖ్యంగా రంగా మరణానంతరం నుండి ఈ విద్వేషాలను రెచ్చగొడుతూనే ఉన్నారని, అయితే ఇందులో వాస్తవాన్ని కూడా వివరించారు.

కృష్ణా, గుంటూరు ప్రాంతాలలో అన్ని కులాలు అభివృద్ధి చెందాయి, అన్ని కులాల వారు అన్ని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక వర్గం వారు మరొక వర్గం క్రింద పని చేయాలనే బానిసత్వం ఇక్కడ కనిపించదు, రాజకీయాలలో కూడా కమ్మ, కాపు, ముస్లిం, వైశ్య, బ్రాహ్మణ, యాదవ, గౌడ, రెడ్డి… ఇలా అన్ని కులాల వారు పోటీచేస్తారు, గెలుస్తారు కూడా!

కోస్తా ప్రాంతంలో అన్ని కులాలు అభివృద్ధి చెందడం ద్వారా వచ్చే పోరాటాలే కనిపిస్తాయి గానీ, బానిసత్వం, కులాల వెనుకబాటుతనం కనిపించదు. నేటి యువతలో సినిమాల ద్వారా వచ్చే కులాభిమానం తప్ప ఈ ప్రాంతంలో కుల వివక్ష ఎక్కడా కనిపించదు.

కానీ వైసీపీ వారు కడప జిల్లాలో అన్ని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు కేవలం తమ వర్గం వారికే ఇస్తారు? ఇక్కడ వేరే కులాలు లేవా అంటే… బలిజ సామాజిక వర్గం వారు మీ కంటే ఎక్కువ ఉన్నారు కదా! వారికి ఎందుకు స్థానం కల్పించడం లేదు.

నాడు 94లో టిడిపి ఒక అసెంబ్లీ స్థానం ముస్లింలకు ఇచ్చారు, ఆనవాయితీగా ఆ ముస్లిం సీటు అనేది కొనసాగుతూ వస్తోంది. లేకపోతే ఈ స్థానం కూడా ఆ వర్గానికే, అన్ని ఓసి స్థానాలు వారికే. ఇక కాంట్రాక్టులు, వ్యాపారాలు అన్ని ఒక వర్గం వారి చేతిలోనే ఉండడం స్పష్టంగా కనపడుతుంది.

ఈ పరిస్థితి కోస్తా ప్రాంతంలో లేదుగా, మరి నిజంగా కుల వివక్ష, బానిసత్వం, కులాల వెనుకబాటుతనం కోస్తాలో ఉందా? కడపలో ఉందా? ప్రజలే ఆలోచించుకోండి… అంటూ చెప్పిన ఈ వీడియో ప్రజలకు ఓ మేలుకొలుపులా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఈ వీడియోలో చెప్పింది నిజమేనా?

https://twitter.com/AntiJagan9/status/1486754713764646912