YS Jagan - BJP planning to take TDP MLAs-ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిరాయింపులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమతో ఎందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారో చెప్పనందుకు ఆనందించాలని జగన్ సున్నితంగా హెచ్చరించారు. “నేను డోర్‌ తెరిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కేది కాదు. ఎవరినైనా మా పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే అనుమతిస్తాం,” అని కూడా జగన్ చెప్పుకొచ్చారు.

అయితే ఈ ప్రకటనతో ఫిరాయింపులు ఆగిపోతాయి అని కూడా లేదట. బీజేపీతో ఖచ్చితమైన అవగాహన మేరకే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వారి మధ్యన ఉన్న సర్దుబాటు ప్రకారం ఖచ్చితంగా గెలుస్తాం అని నమ్మకం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఉపఎన్నికలు ఎదురుకుంటారు. ఆ రకంగా జగన్ తాను అన్నమాట నిలబెట్టుకుంటారు. అదే సమయంలో గెలుస్తామో లేదో అని అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకుంటుంది.

బీజేపీ జగన్ లాగా రాజీనామా చేశాకే అనుమతిస్తాం అని శపథాలు ఏమీ చెయ్యలేదు గనుక వారు రాజీనామా చెయ్యరు. వారి అనర్హత పిటిషన్లు స్పీకర్ ఆమోదించారు. అదేమని అడిగితే మా పార్టీలోకి వచ్చిన వారి రాజీనామాలు ఆమోదింప చేసుకున్నాం. బీజేపీ ఇప్పుడు ఆ పని చేసుకోవాలి అని జగన్ చెప్పి ఊరుకుంటారట. దీనితో స్వామి కార్యం స్వకార్యం కూడా జరిగినట్టు అవుతుంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి మాత్రం కష్టకాలమనే చెప్పుకోవాలి.