YS Jagan Bharathi Cements Donation towards CM coronavirus fundవైఎస్సార్ కాంగ్రెస్ అంటే పడని చంద్రబాబు నాయుడు, రామోజీ రావులు కూడా కరోనా విపత్తుని ఎదురుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వడంతో డిఫెన్స్ లో పడిపోయారు జగన్. ముఖ్యమంత్రి కంపెనీలు ఏమీ విరాళాలు ఇవ్వవా అంటూ పలువురు విమర్శించారు. దీనితో జగన్ కంపెనీల నుండి విరాళాలు ప్రకటించారు.

తాజగా భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) తనవంతు సహాయాన్ని అందించింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు.

వర్షిని చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ ప్రకారం మొట్టమొదటి సారిగా జగన్ కంపెనీల నుండి రాష్ట్ర ఖజానాకు విరాళం అందినట్టు అయ్యింది. గతంలో హుద్ హుద్ బాధితుల కోసం జగన్ 50 లక్షల విరాళం ఇచ్చినా అది రాష్ట్రప్రభుత్వానికి కాకుండా వైఎస్ ఫౌండేషన్ కు ఇచ్చారు.

మరోవైపు, రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం ఒకే రోజు 67 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులను 111 కు చేర్చింది. ఉదయం చివరి అప్డేట్ ప్రకారం, మరో 21 కేసులు మొత్తం 132 కు చేరాయి. ఈ కేసుల్లో ఎక్కువ భాగం మార్చి మధ్యలో ఢిల్లీలోని జమాత్ ఈవెంట్ కు సంబంధించినవి. తెలంగాణాలో కూడా అమాంతం కేసులు పెరుగుతున్నాయి. అక్కడ కూడా ఢిల్లీ ఈవెంట్ ప్రభావమే ఎక్కువగా ఉంది. మరోవైపు దేశంలో కేసులు 2100 దాటిపోయాయి.