Anitha Vangalapudi - YS Jaganదేశంలో మొట్టమొదటిగా తయారైన కరోనా వాక్సిన్…. కొవాక్సీన్ ను చేసిన భారత్ బయోటెక్ పై ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ ముప్పేట దాడి చేస్తుంది. ముఖ్యమంత్రే రంగంలోకి దిగి ఆ కంపెనీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. వాక్సిన్ కంపెనీ ఓనర్ రామోజీ రావు కుమారుడి వియ్యంకుడు అని, చంద్రబాబుకు కూడా చుట్టరికం ఉందని… ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు.

ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు ఆ దాడిని కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా… భారత్ బయోటెక్ పై వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న దాడి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన దేశంలోని ప్రసిద్ధ ఆమ్రాన్ కంపెనీకి మూసి వెయ్యాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఇచ్చిన నోటీసును ఉటంకిస్తూ అనిత ఈ వ్యాఖ్యలు చేశారు.

“భారత్ బయోటెక్ తెలంగాణలో ఉంది కాబట్టి బ్రతికిపోయింది, అదే ఇక్కడ ఉండి ఉంటే, జనరేటర్ పొగ ఎక్కువ వచ్చిందని, గేట్ తీస్తే సౌండ్ వస్తుందని చవటాయ్ వంకలు చెప్పి భారతి బయోటెక్ చేసేవరకు వదిలేవాడు కాదు,” అని ఆమె ట్విట్టర్ లో ఛలోక్తి విసిరారు. ఇది ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.

మరోవైపు… వాక్సిన్ల కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు పిలుపునిచ్చింది. మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించింది. ఇప్పటికే వాక్సినేషన్ లో పూర్తిగా వెనుకబడిన రాష్ట్రం ఈ గ్లోబల్ టెండర్లకు స్పందన ఏ విధంగా ఉంటుందో అనే ఆందోళనలో ఉంది. గతంలో రాష్ట్రం ఇలాగే ఆక్సిజన్ కోసం టెండర్లు పిలిస్తే స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది.