YS Jagan - bailతమ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఏకుమేకై కూర్చున్నా ముఖ్యమంత్రి జగన్ ఎందుకనో ఆయన మీద యాక్షన్ తీసుకునే సాహసం చెయ్యలేదు. పార్టీ నుండి బహిష్కరిస్తే వేరే పార్టీలో చేరిపోయే అవకాశం ఉండటంతో ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆయనను కూడా ఇంకో ప్రతిపక్షంలా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు.

అయితే ఇప్పుడు ఆయన ఏకంగా జగన్ బెయిల్ రద్దు చెయ్యాలని కోర్టుకు వెళ్ళేదాకా వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని, ముఖ్యమంత్రి అయ్యాకా 80 సార్లు కోర్టుకు హాజరు కాకుండా విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని, తన కేసులలోని సహనిందితులకు పదవులు ఇస్తున్నారని ఆయన పిటిషన్ లో చెప్పుకొచ్చారు.

రాజకీయ వైరం కారణంగానే రఘురామ కృష్ణం రాజు కోర్టుకు వెళ్లారని సంగతి తెలిసిందే. అయితే ఆయన పిటిషన్ లో హాజరు కాకుండా విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు అనే పాయింట్ మాత్రం అక్షర సత్యం. ఒకవేళ కోర్టు ఆ కోణాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ జరిగితే ఇబ్బందే అని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

“జగన్ బెయిల్ రద్దయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే ముఖ్యమంత్రి అయ్యాకా ఆయన కనీసం ఒక్క వాయిదా కు కూడా హాజరు కాకపోవడాన్ని కోర్టు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కావడంతో బెయిల్ రద్దు చెయ్యకపోవచ్చు గానీ విచారణకు సహకరించాలని హెచ్చరించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది,” అని లీగల్ ఎక్సపర్ట్స్ అంటున్నారు.