YS- Jagan- attacker srinivas TDP membership cardప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం వేగవంతం చేసింది. నిందితుడు శ్రీనివాస్‌ చెప్పినట్లుగా లేఖ రాసిన వ్యక్తితో పాటు మరొక వ్యక్తిని పోలీసులు విచారించారు. నిందితుడి స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలోని అతడి బంధువులు, స్నేహితులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు.

మరోవైపు నిందితుడు జగన్ అభిమాని అని తేలడంతో వైకాపా అతనిని ఎలాగైనా టీడీపీ వ్యక్తిగా చిత్రీకరించే పనిలో పడింది. ఇప్పటికే అతని పక్కన చంద్రబాబు, లోకేష్ ల ఫోటోలు పెట్టి బ్యానర్ డిజైన్లు పెట్టారు. అదే కాకుండా టీడీపీ కండువా వేసుకున్న ఒక వ్యక్తి ఫోటో తెచ్చి ఇతనే నిందితుడు అని చెప్పే ప్రయత్నం చేసారు. అయితే రెండు సందర్భాలలోనూ ఫెయిల్ అయ్యారు.

తాజాగా వారు ఇంకో ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ టీడీపీ సభ్యుడు అని చెబుతూ ఒక టీడీపీ సభ్యత్వ కార్డును విడుదల చేశారు. అయితే అది కూడా నకిలీ అని టీడీపీ నాయకులు ప్రూవ్ చేశారు. కార్డు మీద అతనిది అమలాపురం నియోజకవర్గం అని ఉండటం గమనార్హం. నిజానికి నిందితుడి గ్రామం ముమ్మిడివరం నియోజకవర్గం కిందకు వస్తుంది. దీనితో ఇది మరొక ఫోటోషాప్ మాయాజాలం అని తేలిపోయింది. కోడి కత్తి నిందితుడిని టీడీపీలో చేర్చాలని వైకాపా ఉబలాటపడుతున్నట్టుగా కనిపిస్తుంది.