YS Jagan _ Eenadu
2014-19 మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వ్యతిరేక వార్తలు ప్రచురించని ఈనాడు పత్రిక ఈరోజు ఎందుకనో పంథా మార్చుకున్నట్టు కనిపించింది. పోలవరం ప్రాజెక్టు అస్మదీయులకు కట్టబెట్టడానికి సెంట్రల్ విజిలెన్సు కమిషన్ రూల్స్ ను అతిక్రమించి రీ-టెండరింగ్ నిబంధనలు రూపొందించినట్టు ఒక వ్యాసం రాసింది. అలాగే ఓసీ కౌలు రైతులకు రైతుభరోసా సాయం ఇవ్వకూడదని ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుపుతూ ఇంకో వార్తను ప్రముఖంగా ప్రచురించింది.

ఒక వార్తలో తప్పు ఏమీ కనిపించలేదు… ఇంకో వార్త ప్రభుత్వ విధానమే. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ ను సమర్ధించే వారు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారన్న విషయం అర్దం అవుతుంది అంటూ సాక్షిలో పని చేసే ఒక సీనియర్ జర్నలిస్టు ఒక వ్యాసం రాయడం విశేషం. నెగిటివ్ వార్తలకు ప్రాదాన్యత ఇవ్వడం తప్పు కాదు. కాని అచ్చంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకోవడం మాత్రం ప్రమాణాలకు తగ్గట్లుగా లేదు అంటూ తీర్పు చెప్పారు.

ఈనాడు జర్నలిస్టు ప్రమాణాలు పాటించడం లేదంటూ బాధ పడిపోయారు. అయితే పోలవరం విషయంలో ఈనాడు ప్రచురించిన వార్త తప్పని మాత్రం చెప్పలేకపోయారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించినట్టు ఓసీ కౌలు రైతులకు ఎందుకు రైతు భరోసా ఇవ్వకూడదో కూడా చెప్పలేదు. దీనిబట్టి తప్పు జరుగుతునందుకు బాధ లేదు దానిని ఎత్తి చూపడమే తప్పు అన్నట్టుగా ఉంది వ్యవహారం. పైగా ఈనాడుకు జర్నలిస్టు విలువలు పాటించడం లేదని చెప్పడం విశేషం.