YS Jagan - Chandrababu - Naiduఎన్నికలకు నెల రోజుల లోపే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ చంద్రబాబు ముందుగానే మొదలు పెట్టినా అభ్యర్థుల ప్రకటనలో మాత్రం జగనే ముందు ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు గాను తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఈరోజు 10గంటల తరువాత ఎప్పుడైనా లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉందంట.

జగన్‌ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం 13 జిల్లాల్లో పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. జగన్‌ ఎన్నికల ప్రచారయాత్రను పెనుగొండ, గాజువాక లేదా గురజాలలో ఏదో ఒక చోట నుంచి ప్రారంభించాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు తెలుగు దేశం పార్టీ గురువారం తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు.

ఆరోజు తొలుత తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళానికి చేరుకుని ఆ జిల్లా పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. ఇలా 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. ఆ తరువాత రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బస్సు యాత్ర చేపడతారు. ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.