YS Jagan Drone Shots Fantasy Kills One and Injures Many2014 ఎన్నికలు అవ్వగానే వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళింది. హైదరాబాద్ లోని చాలా మందికి ఆంధ్ర, తెలంగాణ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయని, ఎన్నికలు వేరువేరుగా జరగడం వల్ల వారు రెండు చోట్లా ఓట్లు వేస్తున్నారని కంప్లయింట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని కోరారు. ఆ తరువాత చాలా సందర్భాలలో ఈ సమస్య ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని వెళ్లారు. 2019 ఎన్నికల ముందు బీజేపీతో దోస్తీ కుదరడంతో జగన్ పని జరిగింది.

మోడీ ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేసి రెండు ఎన్నికలు ఒకే సారి జరిగేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు. అయితే ఇది ఎన్నికల సంఘం కొంపముంచింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సజావుగా జరగడానికి బలగాలు సరిపోలేదు. దీనితో పలుచోట్ల హింస చెలరేగింది. సహజంగా ఆంధ్రప్రదేశ్ బలగాలను తెలంగాణలోనూ, తెలంగాణ బలగాలను ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికల సంఘం ఉపయోగించుకుంటూ వస్తుంది. దీని కోసమే రెండు రాష్ట్రాలకు వేరు వేరు దశలలో ఎన్నికలు జరుపుతారు.

ఒకే దశలో ఎన్నికలు జరపడం వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. దీనితో ఆంధ్రప్రదేశ్ లో హింస కంట్రోల్ చెయ్యలేక ఎన్నికల సంఘం అభాసు పాలయ్యింది. చివరి నిముషంలో అధికారులను ట్రాన్సఫర్ చెయ్యడం కూడా తప్పు అయ్యింది. కొత్తగా వచ్చిన వారు పూర్తి స్థాయిలో స్థానిక పరిస్థితిలను అర్ధం చేసుకునే లోపే ఎన్నికలు జరిగిపోవడంతో నష్టం చేసింది. ఒక రకంగా జగన్ – బీజేపీ దోస్తీ వల్ల ఈ ఎన్నికలలో ఎన్నికల సంఘం తన పరువు పోగొట్టుకుంది. ఎన్నో ఏళ్లగా కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ పోవడానికి కారణం మోడీ ప్రభుత్వం అంటే కాదని అనలేని పరిస్థితి