YSR-Congress-Showing-PK-Withdrawal-Symptomsమే 23న రాబోయే ఫలితాల మీద వైఎస్సార్ కాంగ్రెస్ నేతలుకు అనూహ్యమైన నమ్మకం ఉంది. ఆ పార్టీ నేతలు ఇప్పటికే తాము అధికారంలోకి వచ్చేసినంత హడావుడి చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జగన్ మోహన్ బాబు క్యాబినెట్ ఎలా ఉండబోతోందని చర్చలు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా రాజధాని మార్పు తధ్యమని, అలాగే జిల్లాల ఏర్పాటు కూడా జరుగుతుందని నేతలు అంటున్నారు. ఈ రెండు విషయాలలో తమ అధినేత కు ఖచ్ఛితమైన ఆలోచనలు ఉన్నాయని వారు అనడం విశేషం.

రాష్ట్రంలో ఉన్న ప్రతీ పార్లిమెంట్ స్థానం పరిధిని ఒక జిల్లాగా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో ఇప్పటివరకూ 13 ఉన్న జిల్లాల సంఖ్య 25కు చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాజధానిని అమరావతి నుండి దోనకొండకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు విషయాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బూమ్ రావడంతో ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇప్పుడే అధికారంలోకి వచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొంత సొమ్ము చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటికే కొందరు నాయకులు దోనకొండ వెళ్ళి భూములు కొంటున్నట్టు సమాచారం.

అయితే నిజంగానే వారు అనుకున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచిదే లేకపోతే మొదటికే మోసం జరగొచ్చు. 2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలలో ఇదే రకం హడావిడి కనిపించింది. అయితే ఆ తరువాత ఏమైందో అందరికీ తెలిసిందే. ఈ సారి తమ నాయకుడు చేసిన 3500 పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర తమను అధికారంలోకి తీసుకుని వస్తుందని వారు చాలా నమ్మకంగా ఉన్నారు. ఎవరి జాతకం ఏంటి అనేది ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యి ఉంది అవి 23నే తీర్చుకుంటాయి.