YS Jagan - Andhra Pradesh Disha Lawమహిళల రక్షణకు, భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, ఈ చట్టం వల్ల మహిళల మీద నేరాలు గణనీయంగా తగ్గిపోయాయని ముఖ్యమంత్రి జగన్, ఆయన కేబినేట్ సహచరులు తరచు చెబుతూ ఉంటారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందనే చెప్పుకోవాలి.

దిశ చట్టం పరిశీలన దశలోనే ఉందని కేంద్రం పార్లమెంట్ లో తెలిపింది. ఈ బిల్లు గతంలో కేంద్రం వద్దకు పంపిన మాట వాస్తవమే అయినా కొన్ని వివరణల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపింది. ఈ బిల్లు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్దే పెండింగ్ ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్ లో అన్నారు.

మహిళలపై దాడులకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఏడు రోజుల్లో, కోర్టు విచారణను 14 రోజుల్లో పూర్తి చేయడానికి ఉద్దేశించిన బిల్లు… ది క్రిమినల్‌ లాస్‌ (ఆంధ్రప్రదేశ్‌ అమెండ్‌మెంట్‌) బిల్లు(దిశ) 2019. హైదరాబాద్ లో దిశ రేప్ అనంతర హత్య జరగగానే దేశంలో ప్రజలలో ఆగ్రహావేశాలు పెల్లుబిక్కాయి. ఆ వేడిలో మార్కులు తీసుకోవడానికి గానూ అదే పేరు మీద బిల్లు తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం.

అయితే మహిళల రక్షణకు ఏదో చేస్తున్నాం అని చెప్పుకోవడానికి తప్ప అంత త్వరగా దర్యాప్తు పూర్తి చెయ్యడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే ఈ చట్టం ఇప్పటికే అమలులోకి వచ్చేసినట్టూ దాని ద్వారా మహిళల మీద దాడులు, నేరాలు తగ్గిపోయినట్టు అధికార పార్టీ వారు బిల్డ్ అప్ ఇవ్వడం గమనార్హం.