Complete-List-of-YS-Jagan-Ministersవెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ తొలి కేబినెట్‌ భేటీ ముగిసింది. జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబుతో ఏ మేరకు పోల్చగలమో ఇప్పుడు చెప్పలేం గానీ ఒక్క విషయంలో అయితే ఆయన అధికారులకు తాజా మాజీ ముఖ్యమంత్రిని గుర్తు చేశారు.కారణం ఈరోజు పదిన్నరకు మొదలయిన మంత్రివర్గ సమావేశం దాదాపు ఆరు గంటలపాటు జరిగింది. చంద్రబాబు కూడా ఇలా అత్యధిక సమయాలు సమీక్షలు, సమావేశాలు జరిపేవారు.

కొందరు తెలుగుదేశం పార్టీ ఓటమిలో ఆ సమావేశాలు కూడా కారణమే అని. వాటి వల్ల అధికారుల మీద ఒత్తిడి పెరిగి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసారని కొందరి అభిప్రాయం. అయితే జగన్ విషయంలో ఇంకా కొత్తే కాబట్టి అంత వరకూ మనం మాట్లాడాలేం. తొలి సమావేశం అనేక కీలక విషయాలు చర్చించ వల్సింది కాబట్టి సమావేశం ఆలస్యం అయ్యిందని, జగన్ చంద్రబాబు లాగా అధికారులను ఒత్తిడి చెయ్యరని, స్నేహపూర్వక వాతావరణంలో పని చేయించుకుంటారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన మంత్రివర్గం అక్టోబర్‌ నుంచి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ. 12,500 ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. వృద్ధాప్య పింఛన్లు రూ. 2,250కి పెంపు, ఆశా వర్కర్లకు రూ. 10వేల వేతనం పెంపు నిర్ణయంపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గిరిజన సంక్షేమ శాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రూ. 400 నుంచి రూ. 4000 వరకు వేతనాల పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడు ఐటీడీఏ పరిధిలోని 7265 మందికి లబ్ది చేకూరనుంది. ఇవే కాక మరికొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది.