YS- Jagan - Amaravatiఅమరావతిలోని రాజధానిని మూడు ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యబోతున్నాం అంటూ జగన్ ప్రభుత్వం ప్రకటన చేసిన నాటి నుండీ భూములిచ్చిన రైతులలో కలకలం రేగింది. వారంతా గత పక్షం రోజుల నుండీ రోడ్లు ఎక్కి తమ నిరసన తెలుపుతున్నారు. వారి భవిష్యత్తు మీద వారికి బెంగ పట్టుకుంది.

ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్టు మూర్తి అమరావతిపై జగన్ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అనేది ఒక లైవ్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. “రైతులిచ్చిన 33000 ఎకరాలు ప్రభుత్వం వద్దనున్న 22000 ఎకరాలు కలిపి మొత్తం 55000 ఎకరాలలో ప్రస్తుత కట్టడాలు పోగా మిగిలిన భూమిని స్పెషల్ జోన్ గా చేసి .. మొత్తం భూమిని అయినవాళ్లకి తెగనమ్మి .. రైతులకి 20-25 లక్షలు ఇస్తుందంట,” అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

రాజధాని గా ప్రకటించిన నాటికి ముందే ఎక్కడి భూముల రేట్లు ఎక్కువ. కొన్ని చోట్ల ఎకరా 2 లేక 3 కోట్లు కూడా పలికేది. రాజధానిగా ప్రకటించాకా అది ఎన్నో రేట్లు పెరిగింది. అటువంటిది రైతులను 20-25 లక్షలు ఇచ్చి సమాధానపరచగలదా అనేది అనుమానమే. అటువంటి ప్రయత్నం మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టవచ్చు.

అటువంటి తరుణంలో రైతులు తమ భూములకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని కోర్టుని ఆశ్రయించవచ్చు. అప్పుడు అది ప్రభుత్వం పాలిట గుదిబండగా మారుతుంది. అసలు రాష్ట్రం ఉన్న పరిస్థితులలో భూసేకరణ కుదరదనే అప్పటి ప్రభుత్వం భూసమీకరణకు వెళ్ళింది.