World Bank Opposes Jagan Government's Reverse Tenderingఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలన ఫలితాలతో అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు కావొస్తుంది. ఆయన ప్రస్థానంలో ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు అన్నీ వివాదాస్పదమే. అధికారంలోకి వచ్చాకా జగన్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్నికలను ఎదురుకోలేదు.

ఏపీలో కరోనా కు ,ఉందు జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ల తంతులో అధికార పక్షం అంగబలం గట్టిగా వాడిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి కంప్లయింట్ చెయ్యడం మనకు తెలిసిందే. ఆ తరువాత ఎందుకనో ప్రభుత్వానికి ఎన్నికలంటేనే నచ్చడం లేదు. స్థానిక ఎన్నికలు జరుపుతాం అంటే కుదరదు అంటూ ప్రభుత్వం కోర్టుకు ఎక్కి ఆపడానికి శతవిధానాలుగా ప్రయత్నిస్తుంది.

నిన్న అమరావతిలో జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రికి చంద్రబాబు సవాలు విసిరారు. “ప్రజలు 3 రాజధాని లకు మద్దతు అని చెపితే నేను రాజకీయలనుండి తప్పుకుంటా..రాష్ట్రం అంతా నాతోనే వుందంటున్నావు గా రెఫరెండంకి వెళదామా?,” అంటు చంద్రబాబు సవాలు విసరగా ముఖ్యమంత్రి స్పందించలేదు.

యధావిధిగా తన మంత్రులతో చంద్రబాబుని బూతులు తిట్టించారు. మంత్రులు కూడా ఆ సవాలుకు స్పందించకపోవడం గమనార్హం. దీనిబట్టి జగన్ నిజంగానే ఎన్నికలకు భయపడుతున్నారా? అంటూ టీడీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు. అయితే టీడీపీ పార్టీ గ్రౌండ్ లెవెల్ లో ఇంకా యాక్టీవ్ కాకపోవడంతో ప్రజలలోకి ఆ భావన వెళ్లడం లేదు అని అధికారపక్షం భావిస్తుంది.