YS Jagan -YS Sharmilaవిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి మీద తరచు వినిపించే విమర్శ ఆయన తన అమ్మ విజయమ్మ, చెల్లి షర్మిళను కేవలం ఆయనకు అవసరమైనప్పుడే వాడుకుంటారని, రాజకీయంగా ఎదగనివ్వరని. అయితే దీనిమీద జగన్ క్లారిటీ ఇచ్చారు. ఆయన పాదయాత్ర ఒక నెల పూర్తయిన సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ దీని గురించి చెప్పారు.

“ఆరు నెలల పాటు మనిషే లేకుండాపోతే పార్టీయే లేకుండా పోతుందనే దుర్బుద్ధితో నా మీద కుట్ర చేసారు. దానితో వారు బయటకు వచ్చారు. నాకు తోడుగా నిలబడ్డారు. పదవీ వ్యామోహం అమ్మకు.. పాపకు.. నా భార్యకు లేదు. ఎవరూ అలాంటి భావనతో ఉండరు. రిలేషన్‌షిప్స్‌ కూడా మా ఇంట్లో చాలా స్ట్రాంగ్‌. మా ఇంటి ఆడవాళ్లలో చాలా బలమైన బంధం ఉంది,” అని జగన్ చెప్పుకొచ్చారు.

షర్మిళ గాని విజయమ్మ గాని వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారా అని అడిగినాడు జగన్ చెప్పిన సమాధానం ఇది. దీని బట్టి వారు వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. గత ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు.