YSR Congressతనను ఏ మాత్రం తప్పుపట్టినా ఆగ్రహంతో ఊగిపోతున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అట్టివారిని మాట్లాడకుండా చూడాలని చూడటం విశేషం అంటూ సీఎంపై విమర్శలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.3000 పెన్షన్ ఇస్తామన్నారు..? అసలేమైంది..? అంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రామానాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూరక్వంగా సభను తప్పుదారి పటిస్తున్నారని, పదే పదే అబద్దాలు చెప్పేవారికి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి. రామానాయుడికి సభలో మాట్లాడే అర్హత లేదని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తాము 3,000 రూపాయిల పెన్షన్ ఇస్తామని అనలేదని, పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ వెళ్తామన్నారని ప్రభుత్వ వాదన. పదాల గారడీతో పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ తెర మీదకు తెచ్చింది. ప్రతి ఏడాది కొంత పెంచి ఎన్నికల నాటికి 3,000 రూపాయిలు చేస్తామని ఆ తరువాత చెప్పారు. అయితే రెండో ఏడాది పెన్షన్ ఇంకా పెంచలేదు.

3,000 రూపాయలకు కాకపోయినా దానికి కూడా సమాధానం చెప్పకపోవడం విశేషం. పైగా టీడీపీ తరపున గట్టిగా మాట్లాడుతున్న నిమ్మల మీద విరుచుకుపడి… ఏకంగా ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి చెయ్యడం ముఖ్యమంత్రిలోని అసహనానికి నిదర్శనం అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.