YS Congress Districtwise Manifestoప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య చాలా విలక్షణంగా బెహేవ్ చేస్తున్నారు. పాదయాత్ర మొదలు పెట్టిన కొత్తలో నేను చంద్రబాబు లాగా పుస్తకాల కొద్దీ మేనిఫెస్టో ఇవ్వను కేవలం 2 లేక 3 పేజీల మేనిఫెస్టో ఇవ్వబోతున్న అని ప్రకటించారు. దీనిని ఆహా ఓహో అని పొగిడేశారు సాక్షి మీడియా వారు.

అయితే 10 రోజులు తిరగక ముందే జగన్ మదిలో కొత్త ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా ప్రకటించేసారు కూడా. అదేంటి అంటే తన పాదయాత్ర పూర్తి అవ్వగానే ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాం అని చెప్పుకొచ్చారు ఆయన. పాదయాత్ర తరువాత చేసే బస్సు యాత్రలో ఈ మేనిఫెస్టోలను విడుదల చేస్తారట.

కనీసం మూడు,నాలుగు ప్రదానమైన పనులు ఆయా చోట్ల చేసే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తామని జగన్ తెలిపారు. దీనిని కూడా పనిలో పనిగా పొగిడేశారు సాక్షి వారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 2014 ఎన్నికల్లోనే తెలుగు దేశం పార్టీ నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు విడుదల చేసింది.

మరోవైపు కడప జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి అయింది. ఏడు రోజుల పాటు (మధ్యలో ఒక రోజు కోర్ట్ బ్రేక్ తో) సాగిన ఈ పాదయాత్రలో 93.8 కిలోమీటర్లు నడిచారు జగన్. ఏడవ రోజు 13.8 కిలోమీటర్ల దూరం నడిచారు ప్రతిపక్ష నేత. ఈరోజు పాదయాత్ర కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతుంది.