వైఎస్సార్ కాంగ్రెస్ లో 3-4 లీడర్లు ఉన్నారు. సబ్జెక్టు సంగతి ఎలా ఉన్నా ఈ రోజు రేపు సోషల్ మీడియా, వాట్సాప్ కు పనికొచ్చే మాస్ డైలాగులు దండిగా మాట్లాడగలిగిన నేతలు వారు. రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు ఈ కోవలోకి వస్తారు.
అయితే వివిధ కారణాలవల్ల ఈ మాస్ లీడర్లు సైలెంట్ అయిపోయారు. రోజాకు సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వేస్తుందని వార్తలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలతోనే ఆమెకు పొసగడం లేదట. అయితే వచ్చే కేబినెట్ విస్తరణ వరకు సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని అనుకుంటుంది రోజా.
అంబటి రాంబాబు మాస్ డైలాగులు చెప్పలేకపోయినా మైక్ దొరికితే అనర్గళంగా మాట్లాడే నేత అంబటి. అయితే ఉన్నఫళంగా వరుస ఫోన్ లీకులతో ఇబ్బంది పడుతున్నారు ఆయన. ఆ లీకుల వెనుక ఎవరున్నారో తెలియక… ఎవరిని ఏమంటే ఏది బెడిసికొడుతుందో అని సైలెంట్ అయిపోయారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలకమైన మంత్రి పదవిలో ఉన్నా ఎందుకనో పెద్దగా నోటికి పని చెప్పడం లేదు. ఎప్పుడో అడపాదడపా మీడియా ముందుకు వచ్చినా ఇదివరకటి జోష్ లేదు. నిన్న ఆయన అయ్యన్నపాత్రుడి వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చి జగన్ తల్చుకుంటే మీరు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంటుందా అని కామెంట్ చేస్తే… అవును మరి అయన ఎర్ర చేసినా, బులుగు చేసినా, రోడ్డులు దారుణంగా ఉన్నాయి.. మేము తిరగలేం అంటూ కామెడీ చేస్తున్నారు ప్రతిపక్షం వారు.
ఇక ఈ లీడర్లలో అంతో ఇంతో నోటికి సమర్ధవంతంగా పని చెబుతున్న నాయకుడు కొడాలి నాని మాత్రమే. ఆయన కూడా అనిల్ లాగా ఎప్పుడో గానీ మీడియా ముందుకు రాకపోయినా వచ్చిన ప్రతిసారీ అధికార పార్టీకి కావాల్సిన పని చేసిపెడుతున్నారు.