“స్పీడ్ స్టార్” – అదేనండి మెగాస్టార్… సూపర్ స్టార్ లాగా..!

Young Speed Star - Bellamkonda Srinivas ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతమంది ‘స్టార్’ హీరోలు ఉన్నారు? అంటే… టక్కున చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే… అత్యంత ప్రియమైన సూపర్ స్టార్… మెగాస్టార్… రేంజ్ నుండి ఇటీవల నాచురల్ స్టార్ వరకు అన్ని బాగా పాపులర్ అయ్యాయి. పవర్ స్టార్, యంగ్ రెబల్ స్టార్, స్టైలిష్ స్టార్, సడెన్ స్టార్… ఇలా ఎప్పుడూ ఏదొకటి పుట్టుకొస్తున్న నేపధ్యంలో… తాజాగా మరో ‘స్టార్’ బిరుదు ప్రత్యక్షం అయ్యింది. అయితే ఈయన హీరోల కాంపౌండ్ నుండి వచ్చిన ‘స్టార్’ కాదు, నిర్మాత తనయుడిగా టాలీవుడ్ ప్రవేశించిన అత్యంత ‘కాస్ట్లీ’ స్టార్ గా పేరుగాంచాడు.

‘అల్లుడు శీను, స్పీడున్నోడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం, “జయ జానకి నాయక” సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా పబ్లిసిటీని ఆటోల వెనుక ఫ్లెక్సీలు పెట్టి మరీ ఇస్తున్నారు. కర్నూలులో జరిగిన ఓ ఆటో రాలీ సందర్భంగా తీసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అంతగా ఆ ఫోటోలో ఏముంది? అంటే… బెల్లంకొండ శ్రీనివాస్ ను ‘యంగ్ స్పీడ్ స్టార్’గా కీర్తించడమే..!

బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్యాన్స్ పేరిట వెలిసిన ఈ ఫ్లెక్సీల ఆంతర్యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇది కేవలం ఫ్లెక్సీల వరకే పరిమితమా..? లేక రేపు సిల్వర్ స్క్రీన్ పైన శ్రీనివాస్ పేరు ముందు ఈ ‘యంగ్ స్పీడ్ స్టార్’ అన్న బిరుదు పడుతుందా? అనేది చూడాలి. మొత్తానికి తన తనయుడిని ‘స్టార్ హీరో’గా నిలబెట్టడానికి బెల్లంకొండ చేయని ప్రయత్నాలు లేవన్నట్లుగా కనపడుతున్నాయి. అయితే ఇలా ‘స్టార్’ పెట్టుకుంటే స్టార్ హీరోలు కారు, బాక్సాఫీస్ వద్ద స్టామినా వచ్చిన తర్వాత ‘స్టార్’ పెట్టుకుంటే, దానికి సార్ధకత ఉంటుందన్న విషయాన్ని గమనించాలి.Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

Akhanda Review RatingDon't MissAkhanda Review U.S. Premiere Updates, Rating— After a long episode of Murali Krishna ( Balayya ) vs Varadarajulu (Srikanth) and...Rumours ys jagan declined appointment for mohan babuDon't Missఅయ్యో... మోహన్ బాబుకే దొరకలేదా..? నిజమేనా..?గత ఎన్నికలకు ముందు తమ బకాయిల విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని, రోడ్డెక్కి నిరసన తెలిపిన మంచు మోహన్...Jagan: Age 40, Mindset In 80sDon't MissJagan: Age 40, Mindset In 80sYS Jagan Mohan Reddy is voted to power in the 2019 elections with a mind-blowing...Boyapatai Srinu Akhanda MovieDon't Missహేయ్ బోయపాటి... మళ్ళీ వేసేసారు..!"మెగాస్టార్ అభిమానులందరికీ నేనొక్కటే హామీ ఇస్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకుని సినిమా చూడండి" - 'వినయ విధేయ రామ'...Nandamuri-Balakrishna-Allu-ArjunDon't Miss'చెప్పను బ్రదర్' టు 'ఖచ్చితంగా చెప్తా''సరైనోడు' సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని మెగా అండ్ 'పవర్ స్టార్' అభిమానులు అడిగిన దానికి 'చెప్పను...

Mirchi9