young girls  like to watch  mahesh-babu movie for sankranthi ఇటీవల కాలంలో సంక్రాంతి పండగకు కాస్త రెగ్యులర్ గా సినిమాలు విడుదల చేస్తోన్న హీరో ఎవరు అంటే ప్రిన్స్ మహేష్ బాబు పేరు తారసపడుతుంది. ‘బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే’ వంటి విలక్షణమైన సినిమాలను సంక్రాంతికి విడుదల చేసి హంగామా సృష్టించిన ప్రిన్స్, గత రెండు సంవత్సరాలుగా సంక్రాంతి బరిలో లేరు. అలాగే రాబోతున్న సంక్రాంతి పర్వదినం బరిలో కూడా ప్రిన్స్ లేరన్న విషయం తెలిసిందే. మహేష్ లేకపోయినా, చిరు వర్సెస్ బాలకృష్ణ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా మారడంతో ప్రముఖ మీడియాలన్నీ సినీ ప్రేక్షకుల అభిరుచులను తెలుసుకునే పనిలో పడ్డాయి.

అందులో భాగంగానే ఓ మీడియా సంస్థ ప్రేక్షకులను ప్రశ్నిస్తూ… చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో ఎవరిది చూస్తారని అడుగుతుండగా, మహిళా ప్రేక్షకులు మాత్రం వీరిద్దరూ కాదు, మహేష్ సినిమాలు చూస్తామంటూ బదులివ్వడం విశేషం. ‘మహేష్ సినిమాలు విడుదల చేయమనండి చూస్తాం, చిరు, బాలయ్య సినిమాలు కాదు’ అంటూ ఓ మహిళా అభిమాని తెలుపగా, మరో అభిమాని మాత్రం ‘తానూ కేవలం మహేష్ సినిమాలను మాత్రమే చూస్తానంటూ’ బదులివ్వడం విశేషం.

దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. ప్రిన్స్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తుండగా, ఈ సంక్రాంతి మహేష్ సినిమా రాకపోయినా, ప్రిన్స్ కొత్త మూవీకి సంబంధించిన టీజర్ మాత్రం విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే ఈ సంక్రాంతి మిస్ అయినా, నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం ప్రిన్స్ సిద్ధమవుతున్నారని ఖచ్చితంగా చెప్పే సూచనలు కనపడుతున్నాయి.