Young Girl Kisses YS jaganరాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన మార్క్ మేనరిజంగా ప్రజలకు పరిచయడంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తలపై చేతులు పెడుతూ అందరి నుదుట ముద్దులు పెట్టడం అనేది జగన్ స్పెషాలిటీ. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల సెటైర్లు పడినప్పటికీ, ఇప్పటికీ జగన్ అదే రీతిలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా జగన్ కే కౌంటర్ ఇచ్చే విధంగా ఓ యువతీ ప్రవర్తించింది.

గురువారం నాడు పేర్వారం పర్యటించిన జగన్ తో ఓ సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చిన సదరు యువతీ, ఆ తర్వాత ఒక్కసారిగా జగన్ ను ముద్దాడింది. ఊహించని ఈ పరిణామంతో కోలుకున్న జగన్, వెంటనే ఆమె తలపై చేయి వేసి తన మార్క్ చిరునవ్వుతో సాగనంపారు. ముద్దుకు ముద్దే కౌంటర్ అంటే ఇదేనేమో గానీ సదరు వీడియో మాత్రం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతోంది.

Also Read – నాగార్జున కేసు మూడు రోజులలో… మరి జగన్‌ కేసులో?