Yeh Rishta Kya Kehlata Hai Completes 2500 episodesభారతీయ టీవీ సీరియల్ చరిత్రలో 2500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సీరియల్‌గా ‘యే రిష్తా హై క్యా కెహలాతాహై’ చరిత్ర సృష్టించింది. ఈ దీపావళితో 2500 ఎపిసోడ్లు పూర్తి కావడంతో వేడుక జరుపుకున్నట్టు సీరియల్ నిర్మాత రాజన్ షాహి తెలిపారు. 2009లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

ఈ సీరియల్ కంటే ముందు ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ 2300 ఎపిసోడ్లు ప్రసారమైంది. సుదీర్ఘకాలంగా ప్రసారమవుతున్న సీరియల్‌గా ‘యే రిష్తా హై క్యా కెహలాతా హై’ రికార్డు సృష్టించడంతో యూనిట్ సభ్యులు కేక్ కోసి పండుగ చేసుకున్నారు. ఈ దీపావళి తమకు ఎంతో ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా రాజన్ షాహి తెలిపారు.