Yedu Chepala Katha 2018 -Teaser“ఏడు చేపల కధ” పేరుతో గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న పోస్టర్స్ పబ్లిసిటీ, తాజాగా విడుదల చేసిన టీజర్ తో పతాక స్థాయికి చేరుకుంది. ‘ఎ కంప్లీట్ అడల్ట్ కామెడీ ఫిల్మ్’ పేరుతో ప్రారంభమైన ఈ టీజర్, చెప్పినట్లుగా నిముషంన్నర్రసేపు పూర్తి అడల్ట్ కామెడీని పండించారు.

తన ముందు అమ్మాయి ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి తట్టుకోలేని అబ్బాయి కధే ఈ “ఏడు చేపల కధ.” ‘టెంప్ట్ రవి’ పేరుతో హీరో పండించిన అమాయకత్వపు అడల్ట్ కామెడీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే టాప్ లెస్ సన్నివేశాలను ఈ చిన్న టీజర్ లోనే చూపించి, సిల్వర్ స్క్రీన్ పైన తామేం చూపించబోతున్నారో చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పింది.

ఈ టీజర్ ఖచ్చితంగా ట్రేడ్ వర్గాలను ఆకర్షిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. “ఆర్ఎక్స్ 100” మాదిరి కధలో దమ్ము, కొత్తదనం ఉంటే, ఎంత అడల్ట్ కంటెంట్ అయినా విజయం అందించడానికి ప్రేక్షకులు వెనుకాడరని నిరూపణ అయ్యింది. శ్యాం జే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో అభిషేక్ పాచిపల నటించగా ఏలూరు శ్రీను సంగీతం అందించారు.