yeddyurappa-sworn-in-as-chief-minnister-of-karnatakaకర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన రైతుల రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించారు. బలనిరూపణలో గెలుపు పట్ల తమకు నమ్మకముందని యడ్యూరప్ప అన్నారు. తమ ప్రభుత్వం అయిదేళ్ల పాలన పూర్తిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

తమ పార్టీ సిద్ధాంతాల ప్రకారం అవినీతికి తావు లేదని, శాసనసభ్యులందరినీ తమ మనస్సాక్షి మేరకు ఓటు వేయాలని కోరతానని, ప్రజల తీర్పును గౌరవించాలని అడుగుతానని, తద్వారా బలిరూపంలో గెలుస్తానని యెడ్డీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఫలితాల తర్వాత అనైతిక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీనుండి ఒక్క రూపాయిగానీ పదవి గానీ ఆశించకుండా మనస్సాక్షి మేరకు ఓటు బీజేపీకి వేస్తారన్నమాట. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దీ నిముషాల తరువాతనే యెడ్డీ తన మొదటి అబద్దం ఆడేశారుగా. ఇంక ఐదేళ్ళు అవకాశం వస్తే పరిస్థితి ఎలా ఉంటాదో?