ye-maayo-emo-teliyadhe-bluff-master-songసత్యదేవ్, నందిత శ్వేతలు జంటగా నటిస్తోన్న “బ్లఫ్ మాస్టర్” సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు. ‘ఏ మాయో ఏమో’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఎంతో వినసొంపుగా ఉంది. ముఖ్యంగా గాయని సునీత స్వరం శ్రోతలను సమ్మోహితులను చేస్తుంది.

విశ్వనాథ్ కారసల సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ చక్కటి మెలోడీ ట్యూన్ ను అందించారు. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అభిషేక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫస్ట్ సాంగ్ తో ప్రేక్షకులలో మంచి ఇంప్రెషన్ నే చిత్ర యూనిట్ వేయగలిగింది.