ycp social media సోషల్ మీడియాలో వైసీపీ వింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనినే ప్రతిపక్ష తెలుగుదేశం అనేక రూపాల్లో విమర్శలు కూడా కురిపిస్తుంటుంది. అయితే తాజాగా వైసీపీ సోషల్ మీడియా విభాగంపై బ్రేకింగ్ న్యూస్ అందుతోంది.

వైసీపీ సోషల్ మీడియా విభాగం డిజిటల్ కార్పొరేషన్ కేంద్రంగా న్యాయవ్యవస్థపై విద్వేష విష ప్రచారం జరిగినట్లుగా సీబీఐ బృందం దర్యాప్తులో నిర్ధారణ అయినట్లుగా సమాచారం. దీంతో డిజిటల్ కార్పొరేషన్ ఆఫీస్ నుండి సీబీఐ ఐదుగురిని అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మరియు డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి మాత్రం సీబీఐ నుండి తప్పించుకుని పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగానే సోషల్ మీడియా ఖాతాలు కూడా ఒక్కొక్కటిగా డి యాక్టివేట్ అవుతుండడం విశేషం.

ప్రజాధనంతో వైసీపీ ఈ ఖాతాలను మైంటైన్ చేస్తోందని, ప్రభుత్వ పదవిలో ఉన్న జడ్జ్ లు, న్యాయవ్యవస్థపై చేస్తోన్న విష ప్రచారాన్ని అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యలలో లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి, అజయ్ అమృత్, అవుతూ శ్రీధర్ రెడ్డిలు అరెస్ట్ అయ్యారు.