Kodali Nani About Jr NTRతెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబుపై కొడాలి నాని స్పందించిన విధానంతో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన మరిన్ని పరిణామాలు జూనియర్ ఎన్టీఆర్ కు – తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరిగింది.

తదుపరి జూనియర్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నప్పటికీ, పెద్దగా ప్రభావం లేకపోగా, కొడాలి చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ పై తీవ్ర ప్రభావం చూపించిన వైనం బహిరంగమే. అప్పటి నుండి రాజకీయ పరమైన అంశాలకు పూర్తిగా దూరంగా ఉన్న తారక్, ఇటీవల అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానానికి స్పందించారు.

ఎంతో హుందాగా తారక్ చేసిన వ్యాఖ్యలు ‘కొడాలి నాని అండ్ కో’కు మింగుడు పడలేదన్న విషయం అర్ధమవుతోంది. “జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడమేంటి? అయినా ఎన్టీఆర్ చెప్తే మేమెందుకు వింటాం. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది, చంద్రబాబు ఏం చెప్పినా నమ్మేస్తారు” అంటూ తారక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు కొడాలి.

వైసీపీ నేతల పేర్లను కూడా ప్రస్తావించకుండా, ఎంతో పెద్దరికంగా మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలకు, ‘గొర్రె – కసాయి’ అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యల మధ్య వ్యత్యాసంతో తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొడాలిపై మండి పడుతున్నారు.