YCP MLA Commentsఏపీలో అధికార పార్టీ నేతలు ప్రజలను ఏ విధంగా తూలనాడుతున్నారో అని చెప్పడానికి మరొక ఉదాహరణగా ఓ వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. వైకాపా మంత్రి నిరుద్యోగ యువకులను కుక్కలతో పోలుస్తూ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

కుక్కలకు బిస్కెట్స్ వేస్తే ఎంతో విశ్వాసంగా ఉంటాయని, నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి ఇంత పెద్ద స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని, ఇంత మంచి ముఖ్యమంత్రి కోసం మీరు కనీసం చప్పట్లు కూడా కొట్టడం లేదంటూ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ నోరుజారారు.

ఇలాంటి హేయమైన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుండడంతో, ప్రజలలో చులకన భావన ఎక్కువవుతోంది. అయితే వీటికి ఎక్కడా బ్రేకులు పడకపోగా, అంతకంతకూ పెచ్చుమీరుతుండడం అధికార పార్టీ పోకడకు అద్దం పడుతోంది