YCP leaders tension due to TDP alliancesపొత్తులు అనేది రాజకీయాలలో సర్వసాధారణం అనే విషయాన్ని మరచి తెలుగుదేశం పార్టీ పొత్తులపై వైసీపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ కంగారు పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మా పార్టీ పొత్తు పెట్టుకుంటే, మీ పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతోందని, అయినా పొత్తుల విషయమై ఎన్నికల ముందు నిర్ణయాలుంటాయని., ఇప్పుడంతా ప్రభుత్వంపై పోరాటాలే అంటూ టీడీపీ కూడా గట్టిగానే బదులిచ్చింది.

“ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను” అంటూ పవన్ చేసిన ప్రకటన వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లుగా కనపడుతోందని పొలిటికల్ వర్గాలలో జరుగుతోన్న చర్చ. ఆ ఒక్క మాట జగన్ కు 2014 నాటి ఎన్నికల ఫలితాలను కళ్ళ ముందు ఉంచుతున్నట్టుందని అటు టీడీపీ, ఇటు జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. అందుకే వైసీపీ నాయకులకు పక్క పార్టీల వ్యూహాల మీద శ్రద్ద ఎక్కువైందని రెండు పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

టీడీపీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయగలదా? మీకు., మీ పార్టీకి., మీ అధినాయకుడు చంద్రబాబుకి అంత దమ్ముందా? అంటూ తనదైన శైలిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏపీ శాసన మండలిలో టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ కూడా దానికి ప్రతిగా… సమస్యల మీద మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి దమ్ముందా? అంటూ కౌంటర్ ఎటాక్ చేసింది.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కల్తీ మద్యం మరణాల మీద చర్చకు రావాలంటూ టీడీపీ సభ్యులు ప్రతిసవాల్ విసిరారు. పొత్తులనేది ఆ పార్టీ ఆంతరంగిక విషయమని., దాని మీద నిర్ణయాలు పార్టీ అధినాయకులు తీసుకుంటారని., ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ బద్దంగా ఉన్న ఏ పార్టీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చని, దానికి దమ్ము – ధైర్యం అవసరం లేదన్నది టీడీపీ వాదన.

తెలుగుదేశం పార్టీ తీసుకొనే ఏ నిర్ణయం వెనుకైనా భావం ఒక్కటే అది “రాష్ట్ర అభివృద్ధి – ప్రజా సంక్షేమం” అని తెలుగు తమ్ముళ్లు వైసీపీ నాయకులకు అంతే దమ్ముగా ప్రతిస్పందనను తెలియచేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నా, రాష్ట్ర ప్రజలకు దమ్ముగా చెప్పి, ఆ పార్టీ నాయకులతో కలసి ముందుకెళ్లారని., వైసీపీ పార్టీ మాదిరి లోపాయికారి పొత్తులంటూ రహస్య పొత్తులతో ప్రజలను మోసం చెయ్యరని తమ గళాన్ని వినిపించారు టీడీపీ శ్రేణులు.

2019 ఎన్నికల సమయంలో వైసీపీ లోపాయికారి పొత్తులు ప్రజలకు ఇప్పుడే అర్ధమవుతుందని., రాష్ట్రంలో బీజేపీ పై పోరాటం అంటూనే కేంద్రంలో బీజేపీ పెద్దలతో పైరవీలు తమకు తెలుసునని., జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ పార్టీ మద్దతు పలికిన వైనాన్ని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైసీపీ నాయకులను టీడీపీ సోషల్ వింగ్ ఏకిపారేస్తోంది.

తెలుగుదేశం దమ్ము – ధైర్యం గురుంచి నోరు పారేసుకోవద్దు ‘నోటి’ పారుదల మంత్రి అంటూ అనిల్ కుమార్ పై సెటైర్లతో టీడీపీ కార్యకర్తలు హడావిడి చేస్తున్నారు. బాబాయ్ గొడ్డలిపోటు గురించి మాట్లాడే దమ్ముందా? పక్క రాష్ట్రం వెళ్లి పార్టీ పెట్టిన షర్మిల గురించి మాట్లాడే దమ్ముందా? క్రైస్తవ సోదరులకు ఈ ప్రభుత్వంలో సరైన న్యాయం జరగట్లేదు అన్న మీ బావ బ్రదర్ అనిల్ కు సమాధానం చెప్పే దమ్ముందా? మీరు కానీ, మీ నాయకుడు కానీ ప్రశాంత్ కిషోర్ అండదండలు లేకుండా ఎన్నికలలో పోటీ చేసే దమ్ముందా? అంటూ ఎదురుదాడికి దిగింది టీడీపీ సోషల్ మీడియా.