YCP leader Devendra Reddy incarnate as trade scholarsఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయ‌క్ హ‌వా న‌డుస్తోంది. అయితే తెలంగాణ‌లో ఓ ర‌కంగా ఉంటే.. ఏపీలో మ‌రో ర‌కంగా ఉన్నాయి ప‌రిస్థితులు. మూవీ హిట్ కొట్ట‌డంతో ఏపీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అస్స‌లు ఆగ‌ట్లేదు. ప్ర‌భుత్వం ఎన్నో ఆంక్ష‌లు విధించింద‌ని, త‌క్కువ రేట్ల‌కు టికెట్లు అమ్మాల‌ని చెప్పింద‌ని, లేని పోని ఆంక్ష‌ల‌తో థియేట‌ర్ల య‌జ‌మానుల‌ను వేధిస్తోంద‌ని మండిప‌డుతున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌.

ఇక ప‌వ‌న్ ను కావాల‌నే ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తోందంటున్నారు. అయితే కేవ‌లం ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి మాత్ర‌మే కాకుండా ఇత‌ర సినీ అభిమానుల నుంచి కొన్ని విమ‌ర్శ‌లు రావ‌డంతో.. వాటిని క‌ప్పి పుచ్చుకునేందుకు వైసీపీ నుంచి స‌మాధానాలు వ‌స్తున్నాయి. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన పెద్ద హీరోల సినిమాలు పుష్ప లాంటివి హిట్ కాలేదా, అంత‌కంటే ఇదేమైనా గొప్ప సినిమానా అంటూ కౌంట‌ర్లు వేస్తున్నారు. ఇక తాజాగా వైసీపీ సోష‌ల్ మీడియా ఇన్ చార్జి దేవేంద్ర రెడ్డి కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప‌వ‌న్ ఒక్క‌డే హిట్ కొట్టిన‌ట్టు, ఇంత‌కు ముందు ఎవ‌రూ కొట్ట‌న‌ట్టు హంగామా చేస్తున్నార‌ని సెటైర్లు వేస్తున్నారు. చాలా మంది వైసీపీ నేత‌లు ప‌వ‌న్ హీరో అని, రేట్లు త‌క్కువ ఉంటే అత‌నికి వ‌చ్చే న‌ష్టం ఏంట‌ని, అత‌నేమైనా ప్రొడ్యూస‌రా లేక డిస్ట్రి బ్యూట‌రా అంటూ అడుగుతున్నారు. రేట్లు పెంచాల‌నుకుంటే జాయింట్ క‌లెక్ట‌ర్‌కు అప్లై చేసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు.

నిజానికి వైసీపీ ప్ర‌భుత్వ‌మే ఇదంతా చేసి మ‌ళ్లీ ఇప్పుడు దాన్ని క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. భీమ్లానాయ‌క్ కంటే ముందు వ‌చ్చిన బంగార్రాజు మూవీకి ఇలా రెవెన్యూ అధికారుల‌ను పెట్ట‌లేదు. కానీ ఇప్పుడు ప‌వ‌న్ మూవీ విష‌యంలో చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి మ‌ళ్లీ ప‌వ‌న్‌కు వ‌చ్చిన న‌ష్టం ఏంటంటూ స‌ర్ది చెప్పుకుంటున్నారు వైసీపీ నేత‌లు.

అంటే మిస్టేక్ వాల్లు చేసినా స‌రే దాన్ని స్టైల్ గా క‌ప్పి పుచ్చుకుంటున్నార‌ని నిపుణులు విమ‌ర్శిస్తున్నారు. ఇలా మొత్తానికి ప‌వ‌న్ సినిమా కాస్తా రాజ‌కీయ ర‌గ‌డ‌ను సృష్టించింది. భీమ్లానాయ‌క్ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టు సీన్‌ను క్రియేట్ చేస్తున్నారు. గ‌తంలో చాలామంది హీరోల సినిమాలు వ‌చ్చినా ఇలాంటి వివాదాలు మాత్ర రాలేదు. కానీ ప‌వ‌న్ సినిమా విష‌య‌లోనే రాజ‌కీయాలు తెర‌మీద‌కు రావ‌డం ఇక్కడ గ‌మ‌నార్హం.