YCP Destruction in Kondapalli Muncipal Chaiman Electionకృష్ణాజిల్లాలోని కొండపల్లి మునిసిపల్ ఛైర్మెన్ ఎంపికను అడ్డుకోవడంలో అధికార వైసీపీ పూర్తిగా విజయవంతం అయ్యింది.

గత రెండు రోజులుగా వైసీపీ నేతలు సృష్టించిన దాడులు మీడియా సాక్షిగా వెలుగులోకి వచ్చాయి. ఈ దాడుల నడుమ ఎన్నికల అధికారులు ఛైర్మెన్ ఎంపికను వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు.

మొదటి రోజు అయితే ఎన్నికల అధికారి వాయిదాకు గల కారణాన్ని లిఖితపూర్వకంగా రాసి మరీ ఇచ్చారు. ఇందులో వైసీపీ మెంబర్లు ఆఫీస్ లో విధ్వంసానికి పాల్పడినట్లు స్పష్టంగా పేర్కొన్నారు.

ఎలా అయినా కొండపల్లి మునిసిపాలిటీని సొంతం చేసుకోవాలని గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ విధ్వంసానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

అంతిమంగా హైకోర్టుకు చేరుకున్న ఈ వైసీపీ సీరియల్ ఎపిసోడ్స్ కు బ్రేకులు పడ్డాయి. బుధవారం నాడు ఉదయం పోలీస్ బందోబస్త్ నడుమ ఛైర్మెన్ ఎంపిక జరపాలని ధర్మాసనం ఆదేశించింది.

దీంతో బుధవారం ఉదయం వరకు తమ కౌన్సిలర్లను రక్షించుకునే పనిలో తెలుగుదేశం పార్టీ ఉంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో టిడిపి కౌన్సిలర్లు పటిష్టంగా ఉన్నారు