NTR-Mahanayakudu,-Two-Days-To-Go---No-Buzz-On-Part-Twoనందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత కధాంశం రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అమెరికాలో చిత్రం ప్రీమియర్లు జరిగాయి. మొదటి భాగం, ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ కావడంతో ఈ సినిమా మీద కొంచెం కూడా అంచనాలు లేవు. అంచనాలు లేకపోవడం అటుంచితే అసలు ఈ సినిమా ముందే ప్లాప్ అని ఒక నిర్ణయానికి వచ్చేసారు చాలా మంది. ఆ ప్రభావం సినిమా ఓపెనింగుల మీద స్పష్టంగా కనిపించింది.

మొదటి భాగంకి వచ్చిన దాంట్లో సగం కూడా రాలేదు. అమెరికా ప్రీమియర్లకు ఎన్టీఆర్ కథానాయకుడు దాదాపుగా 450కే డాలర్లు కలెక్ట్ చేస్తే ఎన్టీఆర్ మహానాయకుడి అందులో సగం కూడా రాలేదు. $101,460 మాత్రమే రాబట్టగల్గింది. అయితే ఒకానొక దశలో ఈ చిత్రానికి ఉన్న బ్యాడ్ టాక్ వల్ల ఆ మాత్రం కూడా రాదు అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు మొత్తంగా సినిమా ఎంత రాబడుతుంది అనేది చూడాలి. ఇటీవలే విడుదలైన రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీసిన యాత్ర కొంచెం ఇంచుమించు ఇలాగే మొదలయ్యింది.

ఆ సినిమా ఫుల్ రన్ లో 225,000 డాలర్ల దాకా రాబట్టే అవకాశం ఉంది. మరి ఎన్టీఆర్ ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో చూడాలి? టాక్, రివ్యూలు అయితే అంత గొప్పగా ఏమీ లేవు. చూడాలి మొత్తం మీద ఆ సినిమా ఎంత రాబడుతుంది అనేది? 225-250 అంటే తక్కువనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ మహానాయకుడు యాత్ర మీద ఎన్నో రేట్లు పెద్ద సినిమా. పైగా బాలకృష్ణ లాంటి స్టార్ హీరో, క్రిష్ లాంటి అగ్రదర్శకుడు ఉన్న సినిమా. చూడాలి ఏం జరగబోతుంది అనేది… !!!