Yatra Teaser Talkఏపీ రాజకీయాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. వైఎస్ హయంలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆల్ టైం హిట్ కాగా, అదే సమయంలో ఆయన హయంలో జరిగిన అవినీతి ఆరోపణలు కూడా అంతే ఆల్ టైం హిట్ జాబితాలో ఉన్నాయి. దీంతో వైఎస్ బయోపిక్ పై సినిమా అనగానే ఎలా తెరాకెక్కుతుందా? అన్న ఆసక్తి వైఎస్సార్ అభిమానులతో పాటు సినీ, పొలిటికల్ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.

సినిమాలో ఎలాంటి సన్నివేశాలు చూపించబోతున్నారో చెప్పడం ఇప్పుడే కష్టం గానీ, వైఎస్సార్ గా నటిస్తోన్న మమ్ముట్టి ఆ పాత్రకు జీవం పోసారన్నది మాత్రం ఫస్ట్ టీజర్ స్పష్టంగా చెప్తోంది. పంచె కట్టులో కనిపించిన మమ్ముట్టి, ఒక విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలపించే విధంగా స్క్రీన్ పై కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వస్తోన్న వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయిన “యాత్ర” టీజర్ వీక్షకులను, వైఎస్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.